పునర్‌ వైభవం దిశగా.. పుష్కరిణి!

ఏపీలోనే పెద్ద కోనేరుగా చెప్పుకొనే గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

Published : 02 Jun 2023 04:32 IST

ఏపీలోనే పెద్ద కోనేరుగా చెప్పుకొనే గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఏళ్లుగా నిర్వహణ లేక చాలా వరకు పూడుకొనిపోయింది. 450 ఏళ్ల నాటిది కావడంతో కొన్ని చోట్ల మెట్లూ దెబ్బతిన్నాయి. అప్పట్లో 88 సెంట్ల విస్తీర్ణంలో శ్రీచక్ర ఆకారంలో నిర్మించారు. లోతు ఎంత ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీంతో కుప్పం నుంచి పిలిపించిన నిపుణుల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. పునరుద్ధరణ కోసం రూ.1.50 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని