Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
ఈడీ అధికారులు బెదిరించడంవల్లే దిల్లీ మద్యం కేసులో అరుణ్‌పిళ్లై కవిత పేరు చెప్పినట్లు ఆయన తరుఫు న్యాయవాది శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదించారు.
కోర్టులో అరుణ్ పిళ్లై న్యాయవాది వాదనలు

ఈనాడు, దిల్లీ: ఈడీ అధికారులు బెదిరించడంవల్లే దిల్లీ మద్యం కేసులో అరుణ్‌పిళ్లై కవిత పేరు చెప్పినట్లు ఆయన తరుఫు న్యాయవాది శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదించారు. బెయిల్ కోసం పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగినప్పుడు ఈ మేరకు పేర్కొన్నారు. విచారణకు పిలిచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో పిళ్లైకవిత పాత్ర ఉన్నట్లు చెప్పిన పేపర్‌పై సంతకాలు చేశారన్నారు. అందుకే ఆ వెంటనే తన స్టేట్‌మెంట్‌ను వెనక్కు తీసుకొనేందుకు అనుమతివ్వాలని కోరుతూ రిట్రాక్షన్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు గుర్తుచేశారు. మద్యం కేసులో ఆధారాలు లేకపోయినా ఈడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. న్యాయమూర్తి నాగ్‌పాల్ కేసును జూన్ 8కి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు