సచివాలయ భద్రతాధికారులపై ఉద్యోగినుల ఫిర్యాదు

భద్రతాధికారులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సచివాలయ ఉద్యోగినులు శుక్రవారం సీఎస్‌ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.

Published : 03 Jun 2023 04:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రతాధికారులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సచివాలయ ఉద్యోగినులు శుక్రవారం సీఎస్‌ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పదేపదే తనిఖీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని