హైకోర్టులో తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాలు

హైకోర్టులో శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాలు జరిగాయి. న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Published : 03 Jun 2023 04:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టులో శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాలు జరిగాయి. న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ బృందం పేర్ని నృత్యం, వైష్ణవి సాయినాథ్‌ బృందం యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వారిని జస్టిస్‌ నవీన్‌రావు సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవీణ్‌కుమార్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, న్యాయశాఖ కార్యదర్శి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. లోకాయుక్త కార్యాలయంలోనూ జస్టిస్‌ సి.వి.రాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని