తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

దిల్లీలోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం రాష్ట్రావతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందాజగన్నాథ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

Published : 03 Jun 2023 05:26 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీలోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం రాష్ట్రావతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందాజగన్నాథ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్ని, రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఓఎస్డీ సంజయ్‌ జాజులతో కలిసి తెలంగాణ తల్లి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి దిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి లారెంట్‌ ట్రిపోనే ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందాజగన్నాథ్‌ మాట్లాడుతూ పోరాటాలు, త్యాగాలు చేసి ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ .. దేశం మొత్తం చూసేలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌లో 21 రోజులపాటు దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని