నేడు నిర్మల్‌కు సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం నిర్మల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.

Published : 04 Jun 2023 04:38 IST

సమీకృత కలెక్టరేట్‌, భారాస పార్టీ కార్యాలయం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం నిర్మల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. కొండాపూర్‌ వద్ద నిర్మించిన భారాస పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దీంతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను అందజేస్తారు. మరో ఆరు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల ఆరో తేదీన సీఎం నాగర్‌కర్నూల్‌, 9న మంచిర్యాల, 12న గద్వాల జిల్లా కేంద్రాల్లో పర్యటించి కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు