అన్నదాత ఆగ్రహం

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట ఓ రైతు ధాన్యం పోసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు రాజన్న శనివారం ఉదయం ట్రాక్టర్‌లో ధాన్యాన్ని తీసుకొచ్చారు.

Published : 04 Jun 2023 04:38 IST

కొప్పుల క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిరసన

ధర్మపురి, న్యూస్‌టుడే: మంత్రి కొప్పుల ఈశ్వర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట ఓ రైతు ధాన్యం పోసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు రాజన్న శనివారం ఉదయం ట్రాక్టర్‌లో ధాన్యాన్ని తీసుకొచ్చారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉండగానే ధాన్యాన్ని కార్యాలయం ఎదుట పోశారు. 45 రోజులుగా కమలాపూర్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనకుండా ఆలస్యం చేస్తున్నారని.. బస్తాకు నాలుగు కిలోల తరుగు తీస్తున్నారని రాజన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈశ్వర్‌ సందర్శించారని.. ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పోలీసులు వచ్చి రైతును, ధాన్యాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రైతును విచారించి వదిలేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు