ఎకో పార్కులోకి చిరుత

మహబూబ్‌నగర్‌ పట్టణ సమీపంలోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో చిరుత సంచరించింది. పార్కులోని వన్యప్రాణుల గణన కోసం వారం క్రితం నీటి కుంటలు, సౌరశక్తితో నడిచే బోర్లు, గోల్‌ బంగ్లా(వాచ్‌టవర్‌), అటవీ ప్రాంతంలోకి వెళ్లే ద్వారం వద్ద 10 సీసీ కెమెరాలను అటవీశాఖ ఏర్పాటు చేసింది.

Published : 04 Jun 2023 04:38 IST

హబూబ్‌నగర్‌ పట్టణ సమీపంలోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో చిరుత సంచరించింది. పార్కులోని వన్యప్రాణుల గణన కోసం వారం క్రితం నీటి కుంటలు, సౌరశక్తితో నడిచే బోర్లు, గోల్‌ బంగ్లా(వాచ్‌టవర్‌), అటవీ ప్రాంతంలోకి వెళ్లే ద్వారం వద్ద 10 సీసీ కెమెరాలను అటవీశాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం వాచ్‌ టవర్‌ వద్దకు ఓ చిరుత రాగా.. సీసీ కెమెరాలో నమోదైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఈ అటవీ ప్రాంతంలో 15 వరకు చిరుతలు, అనేక వన్యప్రాణులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఒక ఆడ చిరుత, రెండు కూనలు సంచరించినట్లు పాదముద్రలను బట్టి నిర్ధారించారు. తాజాగా మగ చిరుత కనిపించింది. మహబూబ్‌నగర్‌ కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో చిరుత సంచారంపై రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ట్విటర్‌లో ద్వారా హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంతో అడవుల శాతం వృద్ధి చెందిందని, వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, పాలమూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని