నిరుటి కంటే ముందే అన్నదాతకు రైతుబంధు!
రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌కు రైతుబంధు కింద అందించే పెట్టుబడిసాయాన్ని గతంలో కంటే ముందే రైతులకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వానాకాలం సీజన్ ముందుకు తెస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యోచన
త్వరలో సీఎం తుది నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌కు రైతుబంధు కింద అందించే పెట్టుబడిసాయాన్ని గతంలో కంటే ముందే రైతులకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో పంట సీజన్‌లను ముందుకు జరపాలని నిర్ణయించి కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం దీనికి అనుగుణంగా అన్నదాతలను సన్నద్ధం చేసేందుకు వీలుగా రైతుబంధును కూడా ముందుగానే విడుదల చేసే అంశంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతుబంధు పథకం కింద వానాకాలం, యాసంగి సీజన్‌లకు ఎకరానికి రూ.అయిదు వేల చొప్పున ఏటా మొత్తం రూ.పదివేల సాయాన్ని 63 లక్షల మందికి అందజేస్తోంది. ఏటా వానాకాలం సీజన్‌కు జూన్ మాసాంతంలో నిధులను విడుదల చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టాలు సంభవించిన నేపథ్యంలో మున్ముందు ఈ సమస్య రాకుండా నివారించేందుకు పంట సీజన్‌లను ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు సీజన్ ఏర్పాట్ల కోసం సన్నద్ధం అయ్యేలా వారికి రైతుబంధు సాయాన్ని ముందే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం ఒకటి, రెండురోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
mr pregnant ott release: సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Bhimavaram: భీమవరంలో దారుణం.. ఏడో తరగతి బాలికపై హత్యాచారం
-
HP Chromebooks: గూగుల్‌తో హెచ్‌పీ జట్టు.. భారత్‌లోనే క్రోమ్ బుక్స్ తయారీ
-
Housing sales: జులై- సెప్టెంబరులో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు: అనరాక్
-
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం