తెలంగాణం.. పర్యావరణహితం..
తెలంగాణ మరో ఘనత సాధించింది. అడవుల పెరుగుదల, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి తదితర పర్యావరణహిత కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
అడవుల వృద్ధి, వ్యర్థాల నిర్వహణ.. తదితరాల్లో తొలిస్థానం
శాస్త్ర పర్యావరణ కేంద్రం నివేదిక వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ మరో ఘనత సాధించింది. అడవుల పెరుగుదల, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి తదితర పర్యావరణహిత కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో.. శాస్త్ర పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్- సీఎస్‌ఈ) ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంట్’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వగా, 7.213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2.757 పాయింట్లతో రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది. మిగిలిన 27 రాష్ట్రాలు 3 నుంచి 7 వరకూ పాయింట్లు సాధించాయి. తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పచ్చదనం వృద్ధిలో ముందుండే ఈశాన్య రాష్ట్రాలు ఈసారి చివరి 10 స్థానాల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రెండు, మూడేళ్లుగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టుల నిర్మాణపనుల నేపథ్యంలో పచ్చదనం వృద్ధిపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
మొత్తం 10 పాయింట్లలో అడవుల శాతానికి అత్యధికంగా 3 పాయింట్లు, ఘనవ్యర్థాల శుద్ధికి 1.5, మురుగునీటి శుద్ధికి 1.5, సంప్రదాయేతర ఇంధన స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలకు 1, నదీ పరీవాహక ప్రాంతాల కాలుష్యం తగ్గుదలకు 1, భూగర్భజలాలు, నీటి వనరులకు ఒక్కో పాయింట్‌ను సీఎస్‌ఈ కేటాయించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ దూరదృష్టితోనే తెలంగాణలో పచ్చదనం పెరుగుతోందని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. సీఎస్‌ఈ నివేదికలో తెలంగాణకు తొలిస్థానం రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
సీఎం నిబద్ధతకు గుర్తింపు
-మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి
సీఎస్‌ఈ నివేదికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పర్యావరణం పట్ల సీఎం కేసీఆర్ నిబద్ధతకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్రం మరో అరుదైన ఘనతను దక్కించుకుందని పేర్కొన్నారు. ‘హరితహారంలో తొమ్మిదేళ్లలో దాదాపు 273 కోట్ల మొక్కల్ని నాటాం. రాష్ట్రంలో 2015-16లో అటవీ విస్తీర్ణం 19,854 చ.కి.మీ. ఉండగా.. ప్రస్తుతం 26,969 చ.కి.మీ.కు పెరిగింది. హైదరాబాద్‌లో వ్యర్థాల నుంచి 24 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దేశంలో ఈ రంగంలో రెండో స్థానంలో నిలిచాం. 2014లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి 74 మెగావాట్లు కాగా.. నేడు 5,865 మెగావాట్లకు చేరింది’ అని కేటీఆర్ వివరించారు. ‘‘హరితహారం ద్వారా అటవీ పునరుద్ధరణ ఫలితమే ఈ గుర్తింపు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం రాష్ట్రంలో అటవీ ప్రాంతం 6.85 శాతం, అదే సమయంలో రాష్ట్రం మొత్తం మీద పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగింది’’ అని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ