పెరుగుతున్న లైన్లు... తగ్గుతున్న పోస్టులు
ఒడిశాలో రైలు ఘోర ప్రమాద ఘటన నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలు, ఆ విభాగంలోని ఉద్యోగుల సంఖ్య తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.
రైల్వే శాఖ పొదుపు చర్యలతో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి
హేతుబద్ధీకరణ పేరుతో పోస్టులను సరెండర్ చేస్తున్న జోన్లు
నియామకాలు చేపట్టి తీరాలంటున్న కార్మిక సంఘాలు
ఈనాడు, హైదరాబాద్: ఒడిశాలో రైలు ఘోర ప్రమాద ఘటన నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలు, ఆ విభాగంలోని ఉద్యోగుల సంఖ్య తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. రైల్వేశాఖ నష్టాలు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేందుకు రెండు, మూడేళ్లుగా అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో వివిధ వర్గాల ప్రయాణికుల రాయితీల నిలుపుదలతో పాటు పోస్టుల రేషనలైజేషన్ వంటివి ఉన్నాయి. గత మూడేళ్లలో దేశంలో 19వేల కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి రాగా, ఆ మేరకు కొత్త పోస్టులను బోర్డు భర్తీ చేయలేదు. మరో వైపు రైళ్లను నడిపే లోకో పైలట్లు 12-14 పని గంటలతో ఒత్తిడిలో విధులు నిర్వహించాల్సి వస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారీగా ఖాళీలు...
దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం పోస్టులు 98,787 అయితే...జనవరి నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య 76,777. ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ నియామకాల ద్వారా మరో మూడు వేల మందిని కొత్తగా తీసుకుంటున్నారు. అయినా ఇంకా భారీ సంఖ్యలో ఖాళీలున్నాయి. రైల్వేబోర్డు ఆదేశాల మేరకు 2021-22లో 902 పోస్టులను ద.మ.రైల్వే సరెండర్ చేసింది. 2022-23లో 1,782 పోస్టుల లక్ష్యాన్ని నిర్దేశించగా డిసెంబరు నాటికి 597 పోస్టులను జోన్ సరెండర్ చేసింది. ద.మ.రైల్వేలో మనోహరాబాద్-కొత్తపల్లి మార్గం, ఉందానగర్-మహబూబ్‌నగర్ మధ్య రెండో లైను దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. అక్కడ ట్రాక్ నిర్వహణకు జూనియర్ ఇంజినీర్, వెల్డర్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్, ట్రాక్ మెయింటనర్ వంటి ఉద్యోగుల అవసరం ఎంతో ఉంది. కానీ అక్కడ కూడా ఉన్నవారినే సర్దుబాటు చేస్తున్నారు.
* 2022-23లోనే దేశవ్యాప్తంగా 5000 కిమీ మార్గాన్ని విద్యుదీకరించారు. అందులో ద.మ.రైల్వే జోన్ పరిధిలోనే 1,017 కిమీ మేర పూర్తిచేశారు. ఆయా మార్గాల్లో రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌కు.. మెయింటెనర్, ఇంజినీర్లు అవసరమున్నా కొత్త పోస్టులను మంజూరు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.890 కోట్లతో నిర్మిస్తున్న మిడ్‌లైఫ్ కోచ్ వర్క్‌షాప్‌నకు పోస్టులు భర్తీ చేయలేదని కార్మికసంఘాలు విమర్శిస్తున్నాయి.
* రైళ్లు సురక్షితంగా గమ్యం చేరడంలో ట్రాక్ మెయింటనర్లు కీలకం. పట్టాలు సరిగా ఉన్నాయా? లేదా? అన్నది వీరు నడిచి పరిశీలిస్తారు. 2012లో అనిల్ కకోద్కర్ కమిటీ ఇచ్చిన నివేదికలో రెండేళ్లలో 1,632 మంది ఉద్యోగులు విధి నిర్వహణలో మరణించినట్లు నివేదిక ఇచ్చారు. కొవిడ్ సమయంలో మరో 3,500 మంది రైల్వే ఉద్యోగులు చనిపోయారు.
భద్రతా విభాగంలో ఉద్యోగులు కావాలి
- మర్రి రాఘవయ్య, ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్
ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సబ్‌స్టేషన్లు వంటి చోట్ల భద్రతాపరమైన విధులను రైల్వేశాఖ ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తోంది. గుత్తేదారులు నైపుణ్యం లేనివారిని నియమిస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవడమా? ప్రయాణికుల భద్రత ముఖ్యమా? ఆలోచించాలి. జాతీయస్థాయిలో రైల్వే భద్రతా విభాగంలో ఇప్పటికే 30వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైళ్లు భద్రంగా గమ్యం చేరాలంటే ఖాళీలను భర్తీ చేసి, కొత్త లైన్లకు పోస్టులను మంజూరుచేయాలి. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు 12-14 గంటల పాటు ఏకాగ్రతతో పనిచేయడం కష్టం. పనిగంటలు తగ్గించాలని... వరుసగా రెండుకు మించి నైట్ డ్యూటీలు వేయవద్దన్న దీప్తి త్రిపాఠి కమిటీ నివేదికను అమలుచేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cricket: చైనాకు బయల్దేరిన టీమ్ఇండియా.. ఆ రెండు మ్యాచ్‌లకు బావుమా దూరం
-
Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!