విమానం ల్యాండ్ అయినా డోర్ తీస్తేనా!
విమానం ఎయిర్‌పోర్టుకు వచ్చినా కిందకు దిగేందుకు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గంటపాటు ఇబ్బందిపడ్డ ప్రయాణికులు
శంషాబాద్, న్యూస్‌టుడే: విమానం ఎయిర్‌పోర్టుకు వచ్చినా కిందకు దిగేందుకు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్ రాత్రి 9.30 గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రయాణికులు కిందకు దిగడానికి ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో గంట పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాశ్రయ అధికారులను వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు.
వెనక్కి వచ్చిన రాజమహేంద్రవరం విమానం..
వాతావరణం అనుకూలించక శంషాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయల్దేరిన విమానం వెనక్కి వచ్చింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్ రాజమహేంద్రవరం బయల్దేరగా ప్రతికూల వాతావరణంతో అక్కడి ఎయిర్‌పోర్ట్ ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. ఆ విమానం రాత్రి 10.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akhil: కోలీవుడ్ దర్శకుడితో అఖిల్ సినిమా..?
-
Vande Bharat: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్‌పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్