ఆకట్టుకున్న డ్రోన్‌ షో

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్ద నిర్వహించిన డ్రోన్‌ షో అబ్బురపరచింది.

Published : 05 Jun 2023 04:09 IST

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్ద నిర్వహించిన డ్రోన్‌ షో అబ్బురపరచింది. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 500 డ్రోన్లు వాటికి అమర్చిన లేజర్‌ కాంతులు వెదజల్లుతూ ఈ ప్రాంతాన్ని శోభాయమానం చేశాయి. రాష్ట్ర పురోగతికి అద్దం పడుతూ చేపట్టిన అంబేడ్కర్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాళేశ్వరం ప్రాజెక్టు, అమరుల స్మారక చిహ్నం తదితర లేజర్‌ చిత్రాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్దసంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, వివేకానంద, యాదయ్య,  సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, శేరిలింగంపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని