భద్రతకు, భరోసాకు మారుపేరు తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ.. భద్రతకు, భరోసాకు మారుపేరుగా, ప్రశాంతతకు చిరునామాగా నిలుస్తోందని భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Published : 05 Jun 2023 04:09 IST

సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీసులకు అభినందనలు
ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ.. భద్రతకు, భరోసాకు మారుపేరుగా, ప్రశాంతతకు చిరునామాగా నిలుస్తోందని భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పటిష్ఠమైన శాంతిభద్రతల నిర్వహణతో తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా పేరొందిందన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో సేవలు అందిస్తున్న పోలీసులు, ఇతర సంబంధిత శాఖల్లోని ప్రతి ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఈ మహానగరంలో గత తొమ్మిదేళ్లుగా ఒక్క మతకలహం కూడా లేదు.  వరుసగా కొన్నేళ్లపాటు అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దేశంలోనే తొలిసారిగా అన్నిశాఖలను అనుసంధానం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించాం. 360 డిగ్రీల కోణంలో నిఘాను కొనసాగిస్తూ, ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తుంది ఈ సెంటర్‌’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని