తెలంగాణ సాధించినా.. యువతలో నిరాశే!

తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా నియామకాలు లేకపోవడంతో యువతలో నిరాశ ఉందని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

Published : 05 Jun 2023 04:09 IST

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

భువనగిరి గంజ్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా నియామకాలు లేకపోవడంతో యువతలో నిరాశ ఉందని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యమకారుల అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భిన్నమైన సిద్ధాంతాలు ఉన్న పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా పనిచేసేందుకు తాను ‘అలయ్‌ బలయ్‌’ ప్రారంభించినట్లు చెప్పారు. వేదిక వద్ద ఏర్పాటుచేసిన తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. దత్తాత్రేయను జిట్టా బాలకృష్ణారెడ్డి శాలువాతో సన్మానించారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కళాకారులకు ఉద్యోగాలంటూ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌,  ఆయన అనుచరవర్గం.. ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల ఉన్న దళితులు, పేదల భూములు లాక్కొని ఎకరానికి 300 గజాల స్థలం ఇస్తామంటూ వేధిస్తున్నారన్నారు. గజ్వేల్‌లో రైతులను బెదిరించి భూములను చౌకగా తీసుకుంటున్నారని బాధితులు తన దగ్గరకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారని ఈటల చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్‌, వివిధ పార్టీల నాయకులు ఉద్యమకారులు గాదె ఇన్నయ్య, రాణిరుద్రమ, బండ్రు శోభారాణి, అద్దంకి దయాకర్‌, తుల ఉమ, పాశం యాదగిరి పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని