ప్రొటోకాల్‌ వివాదం.. శిలాఫలకాల తొలగింపు

జగిత్యాలలో రూ.16 కోట్లతో 50 పడకల  ఆసుపత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించే ఔషధ గిడ్డంగి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు.

Updated : 05 Jun 2023 05:17 IST

జగిత్యాలలో రూ.16 కోట్లతో 50 పడకల  ఆసుపత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించే ఔషధ గిడ్డంగి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై జడ్పీ ఛైర్‌పర్సన్‌ పేరు లేకపోవడాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తప్పుపట్టారు.  స్పందించిన మంత్రి ఈశ్వర్‌.. వెంటనే ఈ ఫలకాలను తొలగించి అందరి పేర్లతో కొత్తవి ఏర్పాటు చేయాలని  అధికారులను ఆదేశించారు. శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న మంత్రి ఈశ్వర్‌, అధికారులు, నేతలు, అనంతరం పేర్లు తొలగించిన శిలాఫలకాలను చిత్రంలో చూడవచ్చు.

న్యూస్‌టుడే, జగిత్యాల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు