కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి
కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ప్రధానికి ఆర్.కృష్ణయ్య లేఖ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మోదీకి ఆయన లేఖ రాశారు. ఖాళీల కారణంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సరైన సేవలు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్యోగ నియామకాలు చేపడితే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉద్యోగాలు లభించే అవకాశముంటుందని లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు