న్యూజిలాండ్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
న్యూజిలాండ్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్ నగరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
భారీగా హాజరైన ప్రవాస కుటుంబాలు
ఈనాడు, హైదరాబాద్: న్యూజిలాండ్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్ నగరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్‌లోని ప్రవాస తెలంగాణ కుటుంబాలకు చెందిన ఆరు వేల మంది ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కొవ్వొత్తులను వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు. జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడాపోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. సంగీత దర్శకుడు కోటి, న్యూజిలాండ్ ఎంపీ మార్క్ మిషల్, స్థానిక ప్రవాస నేతలు శివ కిలారి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, అల్లం రవి, మల్లెల గోవర్ధన్ తదితరులు ఉత్సవాలకు హాజరై తెలంగాణ ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూజిలాండ్ తెలంగాణ సంఘం అధ్యక్షుడు మేకల ప్రసన్నకుమార్, ప్రధాన కార్యదర్శి శైలేందర్‌రెడ్డి, ఇతర నేతలు చంద్రశేఖర్, రాజ్‌లోక్, శ్రావణి, గణేశ్, విశ్వనాథ్, సాయి తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
-
Chandrababu: రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు సీఐడీ విచారణ
-
Tirumala: తిరుమలలో తితిదే ఎలక్ట్రిక్ బస్సు చోరీ