సింగపూర్‌లో ‘తెలంగాణ అలయ్.. బలయ్’
సింగపూర్‌లో ఆదివారం ‘తెలంగాణ బలగం అలయ్.. బలయ్ 2023’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
చేగుంట, న్యూస్‌టుడే: సింగపూర్‌లో ఆదివారం ‘తెలంగాణ బలగం అలయ్.. బలయ్ 2023’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ఫ్యామిలీ డే’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా రుక్మాపూర్ గ్రామానికి చెందిన బసికె ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తెలుగు సంస్కృతిని, ఆటలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఖోఖో, అష్టాచమ్మ, పచ్చీస్, కచ్చకాయలు తదితర ఆటలను పిల్లలతో ఆడించి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్‌ఎస్ అధ్యక్షుడు రమేష్‌బాబు, కోశాధికారి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akhil: కోలీవుడ్ దర్శకుడితో అఖిల్ సినిమా..?
-
Vande Bharat: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్‌పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్