మాంద్యాన్ని అధిగమించి.. రాష్ట్ర ఐటీ పరిశ్రమ దూకుడు
ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దూసుకెళ్తోంది. కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఐటీ రంగంపై కనిపిస్తున్నా.. తెలంగాణ మాత్రం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల కార్యకలాపాల విస్తరణతో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి సాధించింది.
వార్షిక నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దూసుకెళ్తోంది. కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఐటీ రంగంపై కనిపిస్తున్నా.. తెలంగాణ మాత్రం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల కార్యకలాపాల విస్తరణతో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి సాధించింది. ఐటీ పెట్టుబడుల్లో 31.44 శాతం, ఉద్యోగాల్లో 16.2 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. 2022-23 సంవత్సరానికి దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో 44 శాతం తెలంగాణకే వచ్చాయి. 2013-14లో ఐటీ ఎగుమతుల మొత్తం రూ.57,258 కోట్లు ఉండగా 2022-23లో పెరిగిన ఎగుమతుల విలువే రూ.57,706 కోట్లుగా ఉంది. 2022-23 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.2,41,275 కోట్లకు, ఉద్యోగాల సంఖ్య 9,05,715కి చేరింది. తెలంగాణ 2021-26 ఐటీ విధానం ముగిసే నాటికి రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఐటీ ఉద్యోగాల సాధనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్ల ముందుగానే ఈ లక్ష్యాన్ని అధిగమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నివేదికలో ప్రధాన అంశాలు...
* తొమ్మిదేళ్ల క్రితంతో పోల్చితే ఐటీ ఎగుమతులు నాలుగింతలు పెరిగాయి. కొత్తగా 5,82,319 ఉద్యోగాలు రావడంతో ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడింతలయ్యాయి.
* తెలంగాణలో తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు (సీఏజీఆర్-కాంపౌండ్ యాన్యుల్ గ్రోత్ రేట్) 17.31 శాతంగా ఉంది.
* దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో 2022లో తెలంగాణ వాటా 33 శాతం ఉండగా.. 2023 నాటికి 44 శాతానికి చేరింది. జాతీయ ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు 9.36 శాతమే ఉంది.
* గడిచిన ఏడాదిలో టీహబ్ 75 హెచ్‌ఎన్‌ఐల(హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) నుంచి 8.5 మిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్‌ను సమీకరించింది. 39 స్టార్టప్‌లకు నిరంతర సమాచార అవగాహన, స్టార్టప్‌లతో అనుసంధానం, కార్పొరేట్ సంబంధాలు నిర్వహించింది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటుతో 100 స్టార్టప్‌ల అనుసంధానం కోసం సహకారం అందించింది. 2016 నుంచి ఇప్పటివరకు ప్రాంతీయ స్టార్టప్‌ల సంఖ్య 400 నుంచి 2500కు పెరిగింది. రుబ్రిఎక్స్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 325 స్టార్టప్ ఆలోచనలు రాగా.. వాటిలో 13 ఎంపికయ్యాయి.
* వీహబ్ 21 స్టార్టప్ కార్యక్రమాలు నిర్వహించి 5,288 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం అందించింది. కొత్తగా 2,833 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్‌హౌస్, గర్ల్స్ ఇన్‌స్టెమ్, వీఆల్ఫా, జీఐజెడ్, ట్రైకార్, లాంచ్‌ప్యాడ్, ప్రాజెక్ట్ ఉజాగర్ కార్యక్రమాలతో బాలికలు, మహిళలకు స్టార్టప్‌లపై అవగాహన కల్పిస్తోంది.
* టీఎస్‌ఐసీ ద్వారా 100 స్టార్టప్‌లకు ప్రభుత్వం రూ.2 లక్షల గ్రాంటు మంజూరు చేసింది. యునిసెఫ్‌తో కలిసి యువత కోసం వైహబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
* ఇమేజ్ ద్వారా 2 దశల్లో మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించి 43 స్టార్టప్‌లను ఎంపిక చేసింది. టీ-వర్క్స్ కేంద్రం ప్రారంభమైంది. రోబోటిక్ విధానం సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్