సింగరేణి వార్షిక లక్ష్యం రూ.50 వేల కోట్లు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ చరిత్రలో అత్యధిక వార్షిక టర్నోవర్‌తో లాభాలు గడించి బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచిందని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు.

Published : 06 Jun 2023 03:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ చరిత్రలో అత్యధిక వార్షిక టర్నోవర్‌తో లాభాలు గడించి బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచిందని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. రానున్న అయిదేళ్లలో వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాలను సాధించి తద్వారా రూ.50 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు ఎదగాలని కృత నిశ్చయంతో ముందుకు సాగాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి భవన్‌లో సోమవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు 19 వేల ఉద్యోగాలను సింగరేణి సంస్థ భర్తీ చేసిందన్నారు. సంబురాల సందర్భంగా ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సన్మానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని