రైల్వేశాఖలో ఖాళీలను భర్తీ చేయాలి: వినోద్‌

రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

Updated : 06 Jun 2023 03:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ మేరకు సోమవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దక్షిణ మధ్య రైల్వేలోని కీలక విభాగాల్లోనే 30వేల ఖాళీలున్నాయని ఆయన వివరించారు. ఖాళీల వల్ల ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోందని... పలు ప్రమాదాలు, అనర్థాలకు దారితీస్తోందన్నారు.  టికెట్‌ కలెక్టర్లు, స్టేషన్‌ మాస్టర్లు, లోకోమోటివ్‌ పైలట్లు, ట్రాక్‌ మెయింటైనర్లు, టెక్నికల్‌ స్టాఫ్‌, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. నిరంతరంగా రైల్వే ట్రాక్‌లను, సిగ్నల్స్‌ లైటింగ్‌లను తనిఖీ చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు అవకాశమేర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరంతరం వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాసిన లేఖలో వినోద్‌కుమార్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని