ప్లాస్టిక్‌ రహిత తెలంగాణే లక్ష్యం

ప్లాస్టిక్‌ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖల మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

Published : 06 Jun 2023 03:33 IST

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖల మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సనత్‌నగర్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పనికాదని, ఇందుకు ప్రభుత్వ సంకల్పానికి తోడు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ... దేశానికి సీఎం కేసీఆర్‌లాంటి డైనమిక్‌ నేత అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వివిధ సంస్థలకు అవార్డులను, పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పీసీబీ ఛైర్మన్‌ రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి థర్మల్‌ప్లాంట్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

పర్యావరణహితంగా విద్యుదుత్పత్తి, గనుల తవ్వకం చేపడుతున్నందుకు సింగరేణి సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. పీసీబీ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు ఈ అవార్డును థర్మల్‌ ప్లాంటు ప్రధాన అధికారి విశ్వనాథ రాజుకు ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని