మెల్‌బోర్న్‌ విక్టోరియా పార్లమెంటులో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవం

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. అక్కడి మెల్‌బోర్న్‌ విక్టోరియా పార్లమెంటు హాలులో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, చిన్న కుమార్తె తేజస్వినిలను సోమవారం ఘనంగా సన్మానించారు.

Published : 06 Jun 2023 04:52 IST

బాలకృష్ణ సతీమణికి జ్ఞాపిక అందజేత

వినుకొండ, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. అక్కడి మెల్‌బోర్న్‌ విక్టోరియా పార్లమెంటు హాలులో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, చిన్న కుమార్తె తేజస్వినిలను సోమవారం ఘనంగా సన్మానించారు. పార్లమెంటు సభ్యుడు స్టీవ్‌మిగ్గ్య్‌ వారికి జ్ఞాపిక అందజేశారు. గొప్ప నటుడిగానే కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి తెలుగువారికి గుర్తింపు తెచ్చినందుకు అక్కడి పార్లమెంటులో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల నిర్వహణకు అనుమతి లభించిందని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఎన్‌ఆర్‌ఐ లగడపాటి సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నేతలు నన్నూరి నర్సిరెడ్డి, గన్నమనేని మురళీకృష్ణ, జీఎంఆర్‌ రాజారెడ్డి, సిసింద్రి, ఎన్టీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

చికాగోలో..

తిరువూరు, న్యూస్‌టుడే: అమెరికాలోని చికాగోలో గ్లోబల్‌ ఐ, ఇండియన్‌ అమెరికన్‌ బిజినెస్‌ కొలిషియన్‌ (ఐఏబీసీ) ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవం ఘనంగా జరిగింది. ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ పురస్కారాలు అందజేశారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి శావల దేవదత్‌, ఎన్‌ఆర్‌ఐ తెదేపా చికాగో కార్యవర్గసభ్యులు హేమ.కె, రవి కాకర, శ్రీనివాస పెదమల్లు, వెంకట్‌ యలమంచిలి, విజయ్‌ కొరపాటి, సీహెచ్‌ రఘు, సీహెచ్‌ హను, సీహెచ్‌ కృష్ణమోహన్‌, ఐఏబీసీ ప్రతినిధులు విజయ్‌ ప్రభాకర్‌, గురుస్వామి, సీహెచ్‌ వాసవి, ఎం.లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు