రేషన్‌ స్టాక్‌ ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు!

రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు ఇక పడిగాపులు కాయనక్కర్లేదని.. స్టాక్‌ ఏ దుకాణంలో ఉంటే అక్కడికి వెళ్లి బియ్యం తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

Published : 07 Jun 2023 02:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు ఇక పడిగాపులు కాయనక్కర్లేదని.. స్టాక్‌ ఏ దుకాణంలో ఉంటే అక్కడికి వెళ్లి బియ్యం తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. పోర్టబులిటీ, పాత స్టాక్‌ అయిపోవడం, కొత్త స్టాక్‌ రావడంలో ఆలస్యం కారణంగా కొన్ని రేషన్‌ దుకాణాలను కొద్ది రోజులే తెరిచి.. ఆ తర్వాత మూసేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌  https://epos.telangana.gov.in/ePoS/closingBalance_Report.html లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఏ దుకాణానికి వెళ్లయినా లబ్ధిదారులు రేషన్‌ పొందొచ్చని అధికారులు సూచిస్తున్నారు.  వెబ్‌సైట్‌ లింక్‌లో లబ్ధిదారులు జిల్లా, సర్కిల్‌ వివరాల ఆధారంగా.. తమ రేషన్‌ దుకాణం నంబరు వెతికి స్టాక్‌ను గమనించొచ్చు. ఇతర దుకాణాల వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే  వివరాలు అందిస్తారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని