ఘనంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘పారిశ్రామిక ప్రగతి’ వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 07 Jun 2023 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘పారిశ్రామిక ప్రగతి’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని టి-హబ్‌లో పరిశ్రమల శాఖ నిర్వహించిన ఉత్సవంలోనూ కేటీఆర్‌ పాల్గొన్నారు. ముషీరాబాద్‌లోని వీఎస్‌టీ వర్కర్స్‌ యూనియన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొని, మాట్లాడారు. తుక్కుగూడ ఫ్యాబ్‌ సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై మాట్లాడారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్‌ వ్యాలీలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ఐటీ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని