నేడు సాగునీటి దినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఆయకట్టుకు నీరు, ఇతర నిర్మాణాలు, సాగునీటి రంగంలో అభివృద్ధితో వచ్చిన మార్పులపై నీటిపారుదల శాఖ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనుంది.

Published : 07 Jun 2023 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఆయకట్టుకు నీరు, ఇతర నిర్మాణాలు, సాగునీటి రంగంలో అభివృద్ధితో వచ్చిన మార్పులపై నీటిపారుదల శాఖ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనుంది. గురువారం ఊరూరా చెరువుల పండగను నిర్వహించనున్నారు. చెరువుల పునరుద్ధరణ పథకం మిషన్‌ కాకతీయ కింద బాగు చేసిన చెరువుల కట్టలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నీటిపారుదల ఉత్సవాల నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు అన్ని జిల్లాల్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు, పంపుహౌస్‌లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని