నైపుణ్య ఆధారిత కోర్సులకు కళాశాలల వెనకడుగు

నైపుణ్య ఆధారిత డిగ్రీ కోర్సులో చేరిన మొదటి నెల నుంచి రూ.10 వేల వేతనం అందుకునే అవకాశం విద్యార్థులకు కల్పించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ చూపినా కళాశాలల యాజమాన్యాలు మాత్రం ముందుకు రాలేదు.

Published : 07 Jun 2023 06:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: నైపుణ్య ఆధారిత డిగ్రీ కోర్సులో చేరిన మొదటి నెల నుంచి రూ.10 వేల వేతనం అందుకునే అవకాశం విద్యార్థులకు కల్పించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ చూపినా కళాశాలల యాజమాన్యాలు మాత్రం ముందుకు రాలేదు. రాష్ట్రంలో 66 ప్రైవేట్‌, 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీబీఏ (రిటైలింగ్‌), బీబీఎస్‌(ఈ కామర్స్‌), బీబీఏ(లాజిస్టిక్స్‌), బీఎస్‌సీ ఫిజికల్‌ సైన్స్‌, బీఏ (కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌), బీకాం (ఈ కామర్స్‌), బీకాం (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌)తో పాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సులకు అనుమతి ఇవ్వాలని విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మూడు రోజులు కళాశాలల్లో పాఠాలు వినాలి...మరో మూడు రోజులు తమ కోర్సుకు అనుగుణంగా కేటాయించిన పరిశ్రమలు, స్టోర్లలో ఇంటర్న్‌షిప్‌ చేయాలి. అందుకు ఆయా పరిశ్రమలు లేదా స్టోర్లు రూ.10 వేల చొప్పున స్టైపెండ్‌ అందిస్తాయి. కోర్సులను మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా ప్రైవేట్‌ నుంచి 21 కళాశాలలు, కళాశాల విద్యాశాఖ పరిధిలో మరో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు దరఖాస్తు చేశాయి. కొన్ని చోట్ల పరిశ్రమలు లేకపోవడం, ఒకవేళ ఆ కోర్సుల్లో చేరితే విద్యార్థుల ఇతర పరీక్షలకు ఇబ్బంది అవుతుందని భావించి కళాశాలలు ముందుకు రాలేదని భావిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని