గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాలు ఏళ్లతరబడి అద్దె, ఇరుకు భవనాల్లో కొనసాగుతున్నందున వెంటనే సొంత భవనాలు నిర్మించాలని టీఎస్‌యూటీఎఫ్‌ గురుకుల ఉపాధ్యాయుల సదస్సు డిమాండ్‌ చేసింది.

Published : 08 Jun 2023 04:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాలు ఏళ్లతరబడి అద్దె, ఇరుకు భవనాల్లో కొనసాగుతున్నందున వెంటనే సొంత భవనాలు నిర్మించాలని టీఎస్‌యూటీఎఫ్‌ గురుకుల ఉపాధ్యాయుల సదస్సు డిమాండ్‌ చేసింది. సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సదస్సులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మెస్‌ ఛార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినందున పాఠశాలల పునఃప్రారంభం నాటికే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు కూడా తగిన వేతనాలు ఇవ్వాలన్నారు. గురుకులాల్లో బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్‌ కాలపట్టికను విడుదల చేయాలన్నారు. గురుకులాలు, వాటిలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే జూన్‌ 13 నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సదస్సులో నిర్ణయించారు. ఆగస్టు 5న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో యూటీఎఫ్‌ అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని