భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
అభివృద్ధి చెందిన దేశాల్లో.. పురుషులతో పోలిస్తే మహిళల్లో బైపాస్ సర్జరీ అనంతర ముప్పు 2-3 శాతం ఎక్కువ ఉంటోందని, భారత్‌లో పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఈ ముప్పు ఒక శాతంలోపేనని తాజా అధ్యయనం చెబుతోంది.
ఈనాడు, హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో.. పురుషులతో పోలిస్తే మహిళల్లో బైపాస్ సర్జరీ అనంతర ముప్పు 2-3 శాతం ఎక్కువ ఉంటోందని, భారత్‌లో పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఈ ముప్పు ఒక శాతంలోపేనని తాజా అధ్యయనం చెబుతోంది. సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్ అధ్యక్షులు, స్టార్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా తమ బృందంతో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ థొరాసిక్ అండ్ కార్డియో వాస్క్యులర్ సర్జరీ సంచికలో ప్రచురితమయ్యాయి. 14 వేల బైపాస్ సర్జరీలను వీరు పరిశీలించారు. అందులో 1825 మంది మహిళలు ఉన్నారు. ఈ డేటా ఆధారంగా శస్త్రచికిత్సల అనంతర ముప్పు శాతాన్ని అధ్యయనం చేశారు. భారత మహిళల్లో బైపాస్ శస్త్రచికిత్స తర్వాత ముప్పు.. విదేశీ మహిళలతో పోలిస్తే తక్కువని నిర్ధారణకు వచ్చారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పు, ఊబకాయం తదితర సమస్యలతో భారత్‌లోనూ మున్ముందు ఈ సమస్య పెరిగే అవకాశం ఉందని వివరించారు. ‘హృదయ సమస్యల బారిన పడుతున్న పురుషుల సరాసరి వయసు 58.5 ఏళ్లు ఉండగా.. మహిళల్లో ఈ సరాసరి వయసు 59.5 ఏళ్లుగా ఉంది’ అని డాక్టర్ సజ్జా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Parineeti-Raghav: పరిణీతి పెళ్లికి రాలేకపోయిన ప్రియాంక చోప్రా.. అసలు కారణమిదే
-
Modi: కాంగ్రెస్.. ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుము: మోదీ తీవ్ర విమర్శలు
-
Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి