‘డ్రైవర్‌ రహిత’ పరిశోధనలకు ఊతం

అటానమస్‌ డ్రైవింగ్‌ (డ్రైవర్‌ రహిత) టెస్టింగ్‌ అంశంలో పరస్పర పరిశోధనలే లక్ష్యంగా టిహాన్‌ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఆన్‌ అటానమస్‌ నావిగేషన్‌)-ఐఐటీహెచ్‌, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యాట్రాక్స్‌ (నేషనల్‌ ఆటోమోటివ్‌ టెస్ట్‌ ట్రాక్స్‌) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

Updated : 09 Jun 2023 04:06 IST

ఐఐటీహెచ్‌-న్యాట్రాక్స్‌ అవగాహన ఒప్పందం

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: అటానమస్‌ డ్రైవింగ్‌ (డ్రైవర్‌ రహిత) టెస్టింగ్‌ అంశంలో పరస్పర పరిశోధనలే లక్ష్యంగా టిహాన్‌ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఆన్‌ అటానమస్‌ నావిగేషన్‌)-ఐఐటీహెచ్‌, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యాట్రాక్స్‌ (నేషనల్‌ ఆటోమోటివ్‌ టెస్ట్‌ ట్రాక్స్‌) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు సంస్థలు గురువారం వర్చువల్‌ విధానంలో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో డ్రైవర్‌ రహిత వాహనాలపై పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆటోమోటివ్‌ పరిశ్రమలో అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. రెండు సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ కార్యక్రమాలతో మార్గనిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు. అటానమస్‌ నావిగేషన్‌ రంగంలో విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. న్యాట్రాక్స్‌ డైరెక్టర్‌ డా.మనీష్‌ మాట్లాడుతూ టిహాన్‌-ఐఐటీహెచ్‌తో ఒప్పందంతో ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ అభివృద్ధిలో ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనగలమన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు