యాదాద్రిలో భక్తుల రద్దీ

విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి గురువారం భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది.

Published : 09 Jun 2023 04:10 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి గురువారం భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. నిత్యారాధనల్లో భాగంగా పూజారులు వైష్ణవ ఆచారంగా స్వామిని మేలుకొల్పి నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.22,62,855 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని