అందరికీ సమాన అవకాశాలేవి?
‘అందరం ఒకలాగే పుట్టాం.. కానీ, అందరికీ సమాన అవకాశాలు మాత్రం లేవు’ అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు.
పల్లె నాగేశ్వర్‌రావు సత్కార సభలో జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని
నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘అందరం ఒకలాగే పుట్టాం.. కానీ, అందరికీ సమాన అవకాశాలు మాత్రం లేవు’ అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లె నాగేశ్వర్‌రావును పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక న్యాయం, అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం జీవితాంతం పోరాటం చేశారు. కానీ, నేటికీ జనాభాలో 50 శాతం మంది నిరక్షరాస్యులు, 60 శాతం మంది పేదలుంటే అందులో అత్యధికంగా దళితులే ఉన్నారు. కారణం సరైన అవకాశాలు లేకపోవడమే. దళితులకు రిజర్వేషన్లు వచ్చేశాయని, వారు ఎదిగిపోయి ఉద్యోగాలు చేస్తున్నారనే అపోహ అందరిలో ఉంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్కువ హోదా, తక్కువ జీతాలున్నవి మాత్రమే దళితులకు వస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతోంది. కానీ, దానిపై ఎక్కడా చర్చ జరగదు’ అన్నారు. టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్ డా.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ..అంబేడ్కర్ న్యాయవాద వృత్తిని చేపట్టి వందేళ్లు పూర్తయిందన్నారు. ఆయన స్ఫూర్తితో వేలమంది న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్నా 4 నుంచి 6 శాతం మంది కూడా నిలబడలేకపోతున్నారన్నారు. సీహెచ్ బాలకృష్ణ అధ్యక్షోపన్యాసం చేయగా బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ డా.ఎం.చేతన, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి డి.ప్రసాదరావు, అంబేడ్కరిస్టు జె.బి.రాజులు మాట్లాడారు. బి.మహేష్‌బాబు స్వాగతం పలకగా, ఎం.దుర్గాప్రసాద్ వందన సమర్పణ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ambedkar statue: అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధమైన 19 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు