బెళగావి ఎక్స్‌ప్రెస్‌ మణుగూరుకు పొడిగింపు

బెళగావి- సికింద్రాబాద్‌ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్‌ప్రెస్‌(07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

Updated : 10 Jun 2023 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: బెళగావి- సికింద్రాబాద్‌ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్‌ప్రెస్‌(07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. బెళగావి, సికింద్రాబాద్‌ మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు లేదు. ఉదయం 5.25కు సికింద్రాబాద్‌కు చేరుకునే ఈ రైలు 5.40కి బయల్దేరి మధ్యాహ్నం 12.50కి మణుగూరుకు చేరుకుంటుంది. మధ్యలో భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, గాంధీపురం, భద్రాచలం రోడ్‌ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మణుగూరు నుంచి సాయంత్రం 3.40కి బెళగావి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరుతుంది. రాత్రి 10.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ నిర్ణయం జులై 1 వరకు అమల్లో ఉంటుందని ద.మ.రైల్వే శుక్రవారం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని