పంచాయతీరాజ్‌ శాఖలో ఎన్నికల బదిలీలు

రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమైంది.

Updated : 10 Jun 2023 05:31 IST

భారీగా స్థానచలనాలకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్‌లు, 605 మండలాలు ఉన్నాయి. మూడేళ్లకి మించి ఒకేచోట ఉన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేపట్టింది. గత నాలుగేళ్లలో మూడేళ్లు పూర్తి చేసుకున్న, 2024 జనవరి 31 నాటికి మూడేళ్లకి మించి ఒకే జిల్లాలో, మండలంలో పనిచేస్తున్న జడ్పీ సీఈవోలు, ఉప సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోల సమాచారం ఇవ్వాలని శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

సగం మందికి పైగా బదిలీ!

రాష్ట్రంలోని జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు, ఎంపీడీవోల్లో దాదాపు సగం మందికి బదిలీ అయ్యే అవకాశముంది. వీరంతా మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. వారిని మార్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. గతంలో ఎన్నికల సెక్టోరియల్‌, జోనల్‌ అధికారులుగా పనిచేసిన వారికి బదిలీ నుంచి మినహాయించారని పలువురు ఎంపీడీవోలు గుర్తుచేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించనున్నట్లు తెలిసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు