గుర్తింపు లేకుండా ప్రాక్టీస్ వద్దు
వైద్య విద్యార్హతలకు సంబంధించి జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ).. చట్టంలో పలు మార్పులను ప్రతిపాదించింది.
ఎన్‌ఎంసీ చట్టంలో సవరణ ముసాయిదా
ఈనాడు, హైదరాబాద్: వైద్య విద్యార్హతలకు సంబంధించి జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ).. చట్టంలో పలు మార్పులను ప్రతిపాదించింది. ప్రధానంగా గుర్తింపు పొందిన అర్హత లేకుండా వైద్య వృత్తి ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించడంతో పాటు వివిధ మార్పులను ప్రతిపాదిస్తూ తాజాగా ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాపై 30 రోజుల్లో అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్‌ఎంసీలోని అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్దేశించిన వైద్య విద్యార్హతలు ఉన్నవారు మాత్రం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వైద్య విద్యకోర్సులను కూడా జాబితాలో చేర్చింది. వీటితోపాటు వైద్య విద్య గుర్తింపు రద్దు, ఉపసంహరణ తదితర అంశాలపై సవరణలతో ముసాయిదాను విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
-
Amazon: కృత్రిమ మేధ స్టార్టప్‌లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
-
AIADMK: ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే కటీఫ్.. పార్టీ శ్రేణుల సంబరాలు!
-
ఖాకీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా శునకాలకు ట్రైనింగ్.. తనిఖీల్లో పోలీసులకు భయానక అనుభవం