పులుల ఛాయాచిత్రాలతో ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’

పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో ప్రత్యేక బస్సులో పులుల ఛాయా చిత్ర ప్రదర్శన కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.

Published : 10 Jun 2023 04:31 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో ప్రత్యేక బస్సులో పులుల ఛాయా చిత్ర ప్రదర్శన కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.  బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనం ముందు ఈ బస్సును అటవీ సంరక్షణ ముఖ్య అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శుక్రవారం ప్రారంభించారు. డోబ్రియాల్‌ మాట్లాడుతూ.. కవ్వాల్‌, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లలో పులుల సంరక్షణకు తెలంగాణ అటవీ శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. రెండు రిజర్వ్‌ ఫారెస్ట్‌లలో కలిపి దాదాపు 30 పులులున్నాయన్నారు. సజ్జనార్‌ మాట్లాడుతూ.. జీవవైవిధ్యానికి ప్రధానమైన పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీనిపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలను భాగస్వాములను చేసేందుకు ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. తాను 13 ఏళ్లు కష్టపడి తీసిన ఫొటోలను హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌లో ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని వన్యప్రాణి ఛాయాచిత్రగ్రాహకుడు డా.జితేందర్‌ గోవిందాని తెలిపారు. ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా టీఎస్‌ఆర్టీసీ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని