కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించలేరా? జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
‘‘తెలంగాణ ధనిక రాష్ట్రంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించలేరా!’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు.
సికింద్రాబాద్, న్యూస్‌టుడే: ‘‘తెలంగాణ ధనిక రాష్ట్రంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించలేరా!’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్రమబద్ధీకరణకు అడ్డుపడుతున్నదెవరని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం తెలంగాణలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాష్ట్ర మహాసదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్రమబద్ధీకరించడం కష్టమేమీ కాదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిసి నాలుగు అడుగులు వేస్తానన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల గురించి ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో వర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావాలంటే వెంటనే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి మాట్లాడుతూ.. 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,300 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. సదస్సులో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్లు పద్మావతి, సి.ఖాసిం, కిషన్ తదితరులు మాట్లాడారు. యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎ.పరుశురాం అధ్యక్షత వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
-
Amazon: కృత్రిమ మేధ స్టార్టప్‌లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు