ఫిల్మ్‌సిటీలో ప్రపంచకప్‌ సందడి

భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌ హడావుడి ఇప్పటికే మొదలైంది. ఇప్పుడా సందడి హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రపంచకప్‌ ట్రోఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated : 21 Sep 2023 07:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌ హడావుడి ఇప్పటికే మొదలైంది. ఇప్పుడా సందడి హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రపంచకప్‌ ట్రోఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌ ట్రోఫీ పర్యటనలో భాగంగా ఆ ప్రతిష్ఠాత్మక కప్పు బుధవారం రామోజీ ఫిల్మ్‌ సిటీకి వచ్చింది. ఇక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కప్పును ప్రదర్శించారు. ఈ ట్రోఫీని రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి, ఈనాడు గ్రూప్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ సహరి, సీహెచ్‌ దివిజ ఆవిష్కరించారు.

క్రికెట్‌ అభిమానుల కేరింతల నడుమ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ప్రపంచకప్‌ విజేతగా నిలిచే జట్టు చేతుల్లో ఒదిగిపోయే ఈ నిజమైన కప్పును ఒక్కసారైనా దగ్గర నుంచి చూడటం కోసం, ఫొటో దిగడం కోసం అభిమానులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, వెంకట్‌, బాపినీడు, ఎ.గోపాలరావు, ఎం.నాగేశ్వర రావు, డీఎన్‌ ప్రసాద్‌, శేషసాయి, పోలీసు అధికారి మన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో కపిల్‌, ధోనీ జట్లు మన దేశానికి ప్రపంచకప్‌లు అందించాయి. ఈ సారి కూడా మన టీమ్‌ఇండియా కప్పును సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని