TREI - RB: ‘గురుకుల’ అభ్యర్థులకు నియామక బోర్డు కీలక సూచన
గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఐచ్ఛికాలు ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు తెలిపింది.
అన్ని ఐచ్ఛికాలు నమోదు తప్పనిసరి
గడువులోగా చేస్తేనే దరఖాస్తు ముందుకు
ఈనాడు, హైదరాబాద్: గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఐచ్ఛికాలు ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఐచ్ఛికాలు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దక్కేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని బోర్డు వెల్లడించింది. గురుకుల ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు అన్ని ఐచ్ఛికాలు ఇస్తేనే దరఖాస్తు ముందుకు వెళ్తుందని, లేకుంటే నిలిచిపోతుందని స్పష్టం చేసింది. పరీక్షలు రాసిన టీజీటీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ, మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9 వరకు గడువులోగా ఐచ్ఛికాలు నమోదు చేయాలంది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇప్పటికే సీబీఆర్‌టీ పరీక్షలు పూర్తిచేసి, తుదికీ, అభ్యర్థుల జవాబుపత్రాలను వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచింది. 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేసిన తరువాతే సొసైటీల వారీగా ఐచ్ఛికాలు తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగార్థులు వ్యక్తం చేసిన సందేహాలపై బోర్డు వివరణ ఇచ్చింది.
దరఖాస్తు సమయంలో తీసుకోనందునే...
గురుకుల పోస్టులకు సంబంధించి.. డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, కళాశాలల్లో లైబ్రేరియన్లు, పీడీలకు దరఖాస్తు సమయంలోనే బోర్డు ఐచ్ఛికాలు తీసుకుంది. ఇవన్నీ మల్టీజోనల్ పోస్టులు కావడంతో ఐచ్ఛికాల సంఖ్య తక్కువగా ఉంది. ఒక్కో పురుష అభ్యర్థి 10 ఆప్షన్లు, మహిళా అభ్యర్థులు మహిళా కళాశాలలతో కలిపి 20 ఐచ్ఛికాలు ఇచ్చారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులన్నీ జోనల్ పోస్టులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో పురుష అభ్యర్థి 35 ఐచ్ఛికాలు, మహిళా అభ్యర్థి 70 ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు తీసుకుంటే సాంకేతికంగా దరఖాస్తుపై తీవ్ర ప్రభావంతో పాటు అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని తీసుకోలేదు. పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం సొసైటీలు, జోన్లవారీగా ఐచ్ఛికాలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. గత నియామకాల్లో అభ్యర్థులు కొన్ని సొసైటీలను ఐచ్ఛికాలుగా పెట్టుకున్నందున పోస్టులు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి అన్ని సొసైటీలు, అన్ని జోన్లకు ఐచ్ఛికాలు తప్పనిసరి చేయడం ద్వారా ప్రతిభ ఉన్న అభ్యర్థులు పోస్టులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బోర్డు పేర్కొంది.
త్వరలోనే గురుకుల డిగ్రీ 1:2 జాబితా
గురుకుల డిగ్రీ పోస్టులకు ఈనెలాఖరు నాటికి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు వెల్లడించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు డెమో తరగతులు ఉన్నాయి. జనరల్ మెరిట్ ర్యాంకు జాబితా విధానం కింద మార్కులు వెల్లడిస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని బోర్డు ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో డెమో తరగతులున్న పోస్టులకు జనరల్ ర్యాంకు జాబితా వెల్లడించకూడదని భావిస్తోంది. డెమో తరగతులు లేని పోస్టులపై ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
మెరిట్ లిస్టు ర్యాంకుల ఖరారు ఇలా: టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు జాబితా తయారీ ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ స్పష్టతనిచ్చింది. బుధవారం ఏఈఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితాను వెల్లడించింది. రాతపరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే.. ర్యాంకుల ఖరారు ఎలా అన్నదానిపై వివరణ ఇచ్చింది. అభ్యర్థి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటుంది. తర్వాత పుట్టినతేదీ.. అది ఒకటే అయితే పోటీ పరీక్ష సబ్జెక్టులో వచ్చిన మార్కులు (జనరల్ స్టడీస్ పేపర్ మినహా) తీసుకుని ఉన్నత ర్యాంకు ఇస్తుంది. ఇవీ సమానమైతే అభ్యర్థి విద్యార్హత.. పరీక్ష పాసైన ఏడాదిని లెక్కలోకి తీసుకుంటుంది. అదీ ఒకటే అయితే విద్యార్హత పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థికి మెరుగైన ర్యాంకు కేటాయిస్తుంది. అక్కడా సమాన మార్కులుంటే ఉన్నత విద్యార్హత.. తర్వాత అందులో మార్కుల శాతం చూస్తామని.. వీటన్నింటిపైనా తమ నిర్ణయమే అంతిమమని కమిషన్ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. -
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్‌నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇదీసంగతి!
-
ఇందూరులో వడగళ్ల బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. -
దీక్షాదివస్ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. -
ఆర్మీ క్విజ్ ఫైనల్స్‌కు తేజ విద్యాలయ విద్యార్థులు
భారత సైనిక దళం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణ అకాడమీ ఆడిటోరియంలో ఆర్మీ క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ నిర్వహించారు. -
స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) ప్రభుత్వం నియమించింది. -
నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ల ద్వారా ఆదేశాలిచ్చారు. -
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గవర్నర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. -
‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్‌లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్‌కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య