చుక్కల్లో కెనడా విమాన టికెట్ ధరలు
కెనడాలోని ఏ నగరానికి వెళ్లాలన్నా విమాన టికెట్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. సాధారణ ధర కన్నా వంద శాతానికిపైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన డిమాండ్!
ఈనాడు, హైదరాబాద్: కెనడాలోని ఏ నగరానికి వెళ్లాలన్నా విమాన టికెట్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. సాధారణ ధర కన్నా వంద శాతానికిపైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్-కెనడా మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం విమాన టికెట్లపైనా పడుతోంది. సాధారణంగా సెప్టెంబరు చివరి వారంలో కెనడాలోని వివిధ నగరాల్లో విద్యా సంస్థలు ప్రారంభమవుతాయి. మొదటి వారంలోనే విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి దుబాయి మీదుగా కెనడాకు వెళ్లేందుకు ఒకవైపు టికెట్ ధర రూ.55 వేల నుంచి 65 వేల మధ్య ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఆ ధర రూ.లక్ష నుంచి రూ. 1.10 లక్షల వరకు పలుకుతుంది. సెప్టెంబరు రెండో వారం నుంచి టికెట్ ధరలు దాదాపుగా సాధారణ పరిస్థితికి వస్తాయి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్లు ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం ఒకవైపు టికెట్ ధర రూ.1.35 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ మూడు నగరాలకు ఎక్కువగా..
ప్రతి విద్యా సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను చదివేందుకు వెళుతుంటారు. ఆ దేశంలోని టొరంటో, మాంట్రియల్, ఒట్టావా నగరాలకు విద్యార్థులు ఎక్కువగా వెళతారు. వాణిజ్యం పరంగా రెండు దేశాల మధ్య రాకపోకలు భారీగానే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మాస్యూటికల్, మిషనరీ, ముత్యాలు, ఆభరణాల వ్యాపారులు కెనడాకు రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, తర్వాత పరిస్థితి మామూలైపోతుందని, ఈ సారి ధరలు భారీగా పెరుగుతున్నాయని ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో టికెట్లకు డిమాండ్ పెరగడంతోనే ఇలా జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం
కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై కఠిన చర్యలొద్దు
మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, ఎక్సైజ్‌శాఖ అప్పటి మంత్రి కొల్లు రవీంద్రపై తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. -
రైతుబంధు పంపిణీకి అనుమతి నిలిపివేత
నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు పథకం నిధుల పంపిణీని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) పేర్కొంది. -
టన్నెల్లో చిక్కుకున్నవారి కోసం ప్రార్థించండి
ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా బయటికి రావాలని దీపం వెలిగించి దేవుణ్ని ప్రార్థించాలని రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ కోరారు. -
అందరికీ అందని ఓటరు స్లిప్పులు!
మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తికాలేదు. -
24 గంటల్లో.. రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో రూ.14 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
ఎస్టీయూటీఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పర్వత్‌రెడ్డి
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) నూతన రాష్ట్ర వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
డిసెంబరు 2 వరకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశమివ్వండి
ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిసెంబరు 2వ తేదీ వరకు అవకాశం కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను ఎస్టీయూటీఎస్, పీఆర్టీయూ తెలంగాణ కోరాయి. -
శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి సోమవారం కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
తిరుమల శ్రీవారిని డిసెంబరు ఒకటో తేదీన తెదేపా అధినేత చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీదే బస చేయనున్నట్లు సమాచారం.


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
-
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం మొండిచేయి: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు
-
Animal: అసలు రన్ టైమ్ 3 గంటల 21నిమిషాలు కాదు.. తెలిస్తే షాకే!
-
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
-
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
-
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక