Khammam: ఒక్క కాలే అయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసం

రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కాలు కోల్పోయినా.. ఆ బుడతడి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతోంది. తన తోటి పిల్లల్లాగే ఆటలు ఆడుతూ.. చదువులోనూ రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

Updated : 23 Sep 2023 07:42 IST

రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కాలు కోల్పోయినా.. ఆ బుడతడి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతోంది. తన తోటి పిల్లల్లాగే ఆటలు ఆడుతూ.. చదువులోనూ రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన మల్లి రాంబాబు, నాగలక్ష్మి కూలీలు. వారికి ఆరేళ్ల శివకుమార్‌తో పాటు మరో ఇద్దరు కుమారులున్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శివకుమార్‌ ఒకటో తరగతి చదువుతున్నాడు. గతేడాది నవంబరులో అతన్ని ప్రమాదవశాత్తు లారీ ఢీకొంది. ఎడమకాలిపై నుంచి టైరు వెళ్లడంతో శస్త్రచికిత్స చేసి.. తొడ వరకు తొలగించాల్సి వచ్చింది. చిన్న వయసులోనే ఓ కాలు కోల్పోయినా అతడి ఆత్మస్థైర్యం సడలలేదు. పాఠశాలలో తోటి పిల్లలతో కలిసి ఒంటి కాలితోనే ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు. కారమ్స్‌లో ప్రతిభ చూపుతున్నాడు. శివకుమార్‌కు ఆధార్‌ కార్డు లేకపోవడంతో అతడికి ఆర్థికంగా అండగా ఉండేందుకు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయలేని పరిస్థితి ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొల్లిపర శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు రూ.1.2 లక్షలు సేకరించారు. ఆధార్‌ మంజూరయ్యేలా చూడాలని అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, కల్లూరు, పెనుబల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని