TS TET Results: రేపు టెట్‌ ఫలితాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్‌) ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్‌-1కు 2.26 లక్షలు, పేపర్‌-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు.

Published : 26 Sep 2023 08:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్‌) ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్‌-1కు 2.26 లక్షలు, పేపర్‌-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు తెలిపాయి.

ఫిజియోథెరపిస్టు పోస్టులకు వెబ్‌ఆప్షన్లు

వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఈ నెల 27న జరిగే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు  పూర్వ జోన్ల ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయాలని టీఎస్‌పీఎస్సీ కోరింది.

సీటీఈటీ ఫలితాలు విడుదల

ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఫలితాల కోసం వెబ్‌సైట్‌ https://ctet.nic.in     ను సంప్రదించవచ్చని సీబీఎస్‌ఈ సూచించింది.

మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లకు చివరి కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిన కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి మంగళవారం సాయంత్రం 4 గంటల్లోపు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ ప్రకటనలో తెలిపింది. ఖాళీలు, ఇతర వివరాలను www.knruhs.telangana.gov.in   వెబ్‌సైట్లో పరిశీలించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని