ముస్లిం సోదరులకు మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు

‘మిలాద్‌ ఉన్‌ నబీ’ పండుగ(సెప్టెంబర్‌ 28)ను పురస్కరించుకొని గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 28 Sep 2023 04:15 IST

గవర్నర్‌, సీఎంల సందేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘మిలాద్‌ ఉన్‌ నబీ’ పండుగ(సెప్టెంబర్‌ 28)ను పురస్కరించుకొని గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ తన సందేశంలో.. సమాజంలో శాంతి, సామరస్యం పెంపొందించేందుకు మనందరం సంకల్పిద్దామని తెలిపారు. దాతృత్వం, ఐకమత్యం, సర్వ మానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని సీఎం కేసీఆర్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

స్వర్ణ విజేత ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి ప్రశంస

చైనాలో జరుగుతున్న ‘ఆసియా గేమ్స్‌-2023’లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీం ఈవెంట్‌(షూటింగ్‌)లో తెలంగాణ అమ్మాయి ఈషాసింగ్‌ బృందం స్వర్ణ పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈషాసింగ్‌ టీం 1759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌ సాధించి, టీమ్‌ స్పిరిట్‌ను చాటిందని సీఎం ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని