హెచ్‌ఎండీఏ ఖాతాలోకి రూ.6,945 కోట్లు

కోకాపేట, బుద్వేల్‌లలో ఆగస్టులో లేఅవుట్ల ఈ-వేలం నిర్వహించగా  బిడ్డర్లు ఆ సొమ్మును హెచ్‌ఎండీఏకు జమ చేశారు.

Published : 28 Sep 2023 04:15 IST

కోకాపేట, బుద్వేల్‌ లేఅవుట్ల చెల్లింపులు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: కోకాపేట, బుద్వేల్‌లలో ఆగస్టులో లేఅవుట్ల ఈ-వేలం నిర్వహించగా  బిడ్డర్లు ఆ సొమ్మును హెచ్‌ఎండీఏకు జమ చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో 21 ప్లాట్లకు  రూ.6,945 కోట్లు వచ్చినట్లు బుధవారం హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 3న కోకాపేటలోని 7 ప్లాట్లకు సంబంధించి 45.33 ఎకరాలను ఈ-వేలం వేయగా.. గరిష్ఠంగా ఎకరా రూ.100.75 కోట్లు పలికింది. హైదరాబాద్‌ చరిత్రలోనే ధర ఆల్‌టైం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. సగటున ఎకరా రూ.73.23 కోట్లకు విక్రయించారు. మొత్తం రూ.3,319.6 కోట్ల ఆదాయం సమకూరింది. ఆగస్టు 10న బుద్వేల్‌లో 14 ప్లాట్లలో 100 ఎకరాలను హెచ్‌ఎండీఏ ఈవేలం ద్వారా విక్రయించింది. గరిష్ఠంగా ఎకరా రూ.41.75 కోట్లకు అమ్ముడుపోగా సగటు ధర రూ.36.25 కోట్లు. 100 ఎకరాలకు రూ.3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని