ఉత్తమ పర్యాటక గ్రామాలకు అవార్డుల ప్రదానం

పర్యాటక దినోత్సవం సందర్బంగా సిద్ద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామ ప్రతినిధులకు బుధవారం దిల్లీలో అవార్డు అందజేశారు.

Published : 28 Sep 2023 04:15 IST

దిల్లీలో పురస్కారాలు అందుకున్న చంద్లాపూర్‌, పెంబర్తి గ్రామాల సర్పంచులు

చిన్నకోడూరు, జనగామ రూరల్‌, న్యూస్‌టుడేే: పర్యాటక దినోత్సవం సందర్బంగా సిద్ద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామ ప్రతినిధులకు బుధవారం దిల్లీలో అవార్డు అందజేశారు. చంద్లాపూర్‌ జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన విషయం తెలిసిందే. కేంద్ర పర్యాటక శాఖ నేతృత్వంలో ఈ పురస్కారాన్ని గ్రామ సర్పంచి చంద్రకళ, అదనపు పాలనాధికారి శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. సస్యశ్యామలమైన గ్రామానికి అవార్డు దక్కడం ఓ చరిత్ర అని మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామస్థులకు శుభకాంక్షలు తెలిపారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భారాస నాయకుడు సూరగోని రవి పాల్గొన్నారు.

  • జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన జనగామ మండలం పెంబర్తి గ్రామ సర్పంచి అంబాల ఆంజనేయులుగౌడ్‌ బుధవారం దిల్లీలో పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే పెంబర్తి హస్తకళలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందగా తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శులు విద్యావతి, శైలజా రామయ్యర్‌ సర్పంచికి అవార్డు అందజేశారు.   
  • తెలంగాణ ప్రభుత్వం పర్యాటక  అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, జాతీయస్థాయిలో పోటీపడి రెండు పురస్కారాలు సాధించడమే ఇందుకు నిదర్శనమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పెంబర్తి, చంద్లాపూర్‌ గ్రామాలకు ‘జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలు’గా అవార్డులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని