ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ

తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత నాయకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Updated : 28 Sep 2023 05:25 IST

శాసనమండలిలో నివాళులర్పించిన ఛైర్మన్‌ గుత్తా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత నాయకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బాపూజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండలి ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గుత్తా నివాళులర్పించారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, చీఫ్‌ విప్‌ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, మధుసూదనాచారి, దయానంద్‌, ఎల్‌.రమణ, శేరి సుభాష్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని