ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో  పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎ.శాంతికుమారి ఉన్నతాధికారును ఆదేశించారు.

Published : 28 Sep 2023 04:35 IST

ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో  పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎ.శాంతికుమారి ఉన్నతాధికారును ఆదేశించారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్‌ బుధవారం హైదరాబాద్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధాని అక్టోబరు 1న ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిని జాతికి అంకితం చేస్తారని, వరంగల్‌-ఖమ్మం, ఖమ్మం-విజయవాడ రహదారికి శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. డీజీపీ అంజనీకుమార్‌, విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రహదారులు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు: సీఎం కేసీఆర్‌

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు పలు ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం, మిలాద్‌-ఉన్‌-నబీ ఒకేరోజు రావడం అరుదు అని, ప్రజలు అధ్యాత్మిక వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని