యాదాద్రి గోపురంపై స్వర్ణకలశ పునఃస్థాపన

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దక్షిణ పంచతల రాజగోపురంపై నుంచి పడిపోయిన స్వర్ణకలశాన్ని సంప్రోక్షణ జరిపి పునఃస్థాపన చేశారు.

Published : 28 Sep 2023 04:35 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దక్షిణ పంచతల రాజగోపురంపై నుంచి పడిపోయిన స్వర్ణకలశాన్ని సంప్రోక్షణ జరిపి పునఃస్థాపన చేశారు. కోతి దూకుడు, గాలి వల్ల గోపురం పై మధ్యలోని బంగారు కలశం వంగి సోమవారం పడిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న ఆలయాధికారులు బుధవారం ఆలయ పూజారులు, వేద పండితులతో సంప్రోక్షణ చేపట్టి కలశ స్థాపన నిర్వహించినట్లు దేవస్థానం డిప్యూటీ కార్య నిర్వహణాధికారి భాస్కరశర్మ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని