ఆస్టర్‌ గార్డియన్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

వైద్య రంగంలో అత్యున్నత సేవలందించే నర్సుకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందించే ఆస్టర్‌ గార్డియన్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Published : 28 Sep 2023 04:35 IST

ఎంపికైన నర్సుకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: వైద్య రంగంలో అత్యున్నత సేవలందించే నర్సుకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందించే ఆస్టర్‌ గార్డియన్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు అమీర్‌పేటలోని ఆస్టర్‌ ప్రైమ్‌ ఆసుపత్రి ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు దరఖాస్తులను www.asterguardians.com వెబ్‌సైట్‌ ద్వారా నవంబరు 15లోగా సమర్పించాలని తెలిపారు. తుది విజేతను 2024 మే 12న(అంతర్జాతీయ నర్సుల దినోత్సవం) ప్రకటించి బహుమతి ప్రదానం చేస్తామని ఆస్టర్‌ డీఎం హెల్త్‌ కేర్‌ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.ఆజాద్‌ ముపెన్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు